OUT CAMPAIGN – Declaration Translated Into TELUGU
Translation by Satish Chandra
నాస్తికులు ఎప్పటినించో కూడా వివేకమంతమైన ఆలోచన విధానమును, జ్ఞాన సంపదను పెంపోన్దించుతూ వస్తున్నారు. ఇప్పుడు నీవు కూడా ఆ తత్త్వములో భాగము కావచ్చు, అవుట్ (OUT) అనే ఉద్యమం ద్వారా.

మన మధ్య మనం అనుకున్న దానికంటే ఎక్కువ మందే ఉన్నారు నాస్తికులు. కాబట్టి నీవు భయపడకుండా నేను నాస్తికుడు/నాస్తికురాలు అని బహిరంగంగా చెప్పుకోవచ్చు. అట్లా చేస్తే నీకు విముక్తి పొందిన భావన కలుగుతుంది. నిన్ను చూసి మిగతా నాస్తికులు కూడా తాము నాస్తికులం అని బహిరంగంగా చెప్పుకోవడానికి సంకోచించరు. (అట్లా అని, నువ్వే వాళ్ళు నాస్తికులు అని చెప్పకూడదు. సరైన సమయంలో వాళ్ళే వ్యక్తపరుస్తారు).

ఈ అవుట్ ఉద్యమం, నాస్తికుల మీద ప్రపంచానికి ఉన్న అపోహలను తొలగించటంతోపాటు, నాస్తికులకు “నేను ఏకాకిని కాను. నాలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు” అని తెలియజేయడానికి తోడ్పడుతుంది. అంతే కాదు, నాస్తిక భావాలను ఎవ్వరూ నిషేధించలేరు అని ఘంటాపధంగా తెలియచేస్తుంది.

ఈ అవుట్ ఉద్యమం ప్రజలకు చేరువయ్యే కొద్దీ, మతానికి భయపడే వాళ్ళ సంక్య, నాస్తికులని ఇష్టపడని వాళ్ళ సంక్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. మనం నాస్తికులం. లేని అతీత శక్తులకు భయపడకుండా, వాటి మీద భారం మోపకుండా, స్వశక్తిని నమ్ముకుని, ఆత్మవిశ్వాసంతో జీవించేవాళ్ళం.

విద్య, రాజకీయ రంగాలలో మత ప్రభావాన్ని ప్రోగెట్టే సమయం వచ్చింది. మతం పేరుతో బెదిరించి, మన పిల్లలు, ప్రభుత్వాల పైన మూఢత్వాన్ని రుద్దే వాళ్ళని చూసి నాస్తికులతోపాటు లక్షలాది మంది మిగతా ప్రజలు కూడా విసుగు చెందుతున్నారు. అతీత శక్తుల మీద నమ్మకాలను మన నీతీ నియమాలనించి, మన ప్రజాశాశనాల నించి దూరం చెయ్యాలి.

అవుట్ ఉద్యమంలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలు చేబడుతున్నాం. వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. అవుట్ ఉద్యమంయొక్క ఎర్ర రంగు ‘A’ టీ-షర్టులు, జేబు పిన్నులు, గుండీలు మరియుస్టికర్లు ఇప్పుడు కొనవచ్చును.